కోలీవుడ్ డస్కీ బ్యూటీ అమలా పాల్ ఒకపక్క సినిమాలు, మరోపక్క ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా అమలా రెమ్యూనిరేషన్ ఎక్కువ చెప్పడంతో అవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయట. ఇక తాజాగా అమలాపాల్ నాగార్జున సినిమాకు నో చెప్పడం…
తెలుగులో అత్యంత పాపులర్ టెలివిజన్ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త ఫార్మాట్‌ను ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. బుల్లితెరపై విజయవంతమైన ఐదు సీజన్ల తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటి ఫార్మాట్ లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. రీసెంట్ గా మేకర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ఫన్నీ ప్రోమోలో హోస్ట్ నాగార్జునతో పాటు పాపులర్ కమెడియన్…
ఈ వారం కొన్ని కొత్త OTT సిఎంమాలు ప్రీమియర్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం ఆ సినిమాలేంటో చూద్దాం. 83బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్‌లలో 24 డిసెంబర్…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని చాలా…
అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్రాన్ భయంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని చాలామంది అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ డిజిటల్ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు…
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు…
టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పడం లేదు. ‘ఘోస్ట్’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కావలసి ఉంది. అయితే తాజాగా దుబాయ్‌కి వెళ్లాల్సిన కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఫలితంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పాజిటివ్ అని తేలిన ‘ఘోస్ట్’ టీమ్ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో…
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే… ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ చివరి ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్లో ఉంటుందని చెప్పాడు. “సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను” అని నాగ్ సైన్ ఆఫ్ చేస్తున్నప్పుడు…
తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్…
చూస్తుండగానే కొత్త సంవత్సరం మొదటి మాసం గడిచిపోతోంది. 2022కు పాన్ ఇండియా సినిమాలతో శుభారంభం జరుగుతుందని సినీజనం భావించారు కానీ వారి అంచనాలన్నీ తల్లకిందులు చేస్తూ ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ వంటి సినిమాల విడుదల వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సీజన్ పూర్తి కాగానే యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. విడుదలైన సినిమాలకు అనుకున్న రీతిలో ఆదరణ దొరక్కపోవడం, నెలాఖరులో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడంతో మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్…