బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్” పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది, ప్రోమో చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నట్టు సమాచారం. కొత్త ప్రోమోలో హోస్ట్ నాగార్జున అక్కినేని షో రేపు ప్రారంభం కానుందని ప్రకటించారు.
Read Also : Singer Deepu : గీతా మాధురితో పాట పాడను… ఎందుకంటే ?
మరోవైపు ఈ ప్రోమో ద్వారా “బిగ్ బాస్ నాన్‌స్టాప్” షో హౌజ్ లోపల ఎలా ఉందన్న విషయాన్ని ఈ చిన్న వీడియోలో రివీల్ చేశారు. లోపల కళ్ళు చెదిరే ఇంటీరియర్ డిజైన్ తో కళ్ళు చెదిరేలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి. ఇక షోలో కంటెస్టెంట్లు ఎవరు ? వంటి తదితర వివరాలను రేపే షో లాంచ్ సమయంలో వెల్లడించనున్నారు.