తెలుగులో అత్యంత పాపులర్ టెలివిజన్ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త ఫార్మాట్‌ను ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. బుల్లితెరపై విజయవంతమైన ఐదు సీజన్ల తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటి ఫార్మాట్ లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. రీసెంట్ గా మేకర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ఫన్నీ ప్రోమోలో హోస్ట్ నాగార్జునతో పాటు పాపులర్ కమెడియన్ వెన్నెల కిషోర్, సీనియర్ నటుడు మురళీ శర్మ కన్పించారు. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఫిబ్రవరి 26న ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. 84 రోజుల పాటు ఈ షో నడుస్తుందని అంటున్నారు. ఓటీటీ వెర్షన్ టీవీ వెర్షన్ కంటే బోల్డ్ గా, స్పైసీగా ఉంటుందని వినికిడి.
Read Also : Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి
ఇక షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఇంకా వెల్లడించకపోవడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. “బిగ్ బాస్ ఓటిటి”లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. అరియానా గ్లోరీ, అఖిల్, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా, అనిల్ రాథోడ్, సరయు, హమీద, నటరాజ్, అషు రెడ్డి, స్రవంతి చోకరపు, చిచా చార్లెస్, ఆర్జే చైతు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ షోలో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.