బిగ్ బాస్ OTT గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు OTTలో మరింత క్రేజ్ అందుకోవడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ‘Bigg Boss Non-Stop’ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ పరంగా నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది. సెలబ్రిటీలను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈరోజు గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరన్న విషయాన్ని ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ప్రస్తుతం బిగ్ బాస్ OTTకి వెళ్లనున్న తారల జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
వైరల్ అవుతున్న లిస్ట్ లో యాంకర్ స్రవంతి, యాంకర్ శివ, ముమైత్ ఖాన్, ఆర్జే చైతూ ఈ ఐదుగురు స్టార్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అషు రెడ్డి, మహేష్ విట్టా, అరియానా, అఖిల్ సార్థక్, హమీద, సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, మోడల్ అనిల్ రాథోడ్, నటి, మోడల్ మిత్ర శర్మ, శ్రీరాపాక, బిందు మాధవి, తేజస్వి మదివాడ, రోల్ రిడా కూడా షోలో భాగం కాబోతున్నారట. అయితే ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే షో స్టార్ట్ అయ్యేవరకు ఆగక తప్పదు!.