హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే పై కారపోకలు బంద్ అయ్యాయి. నాగార్జున హైవే పై నీరు ప్రమాదకరంగా పారుతుండటంతో.. అప్రమత్తమైన అధికారులు బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ మళ్లించారు. హైద్రాబాద్ -నాగార్జున సాగర్ ప్రధాన రహదారి రోడ్ శ్రీఇందు కాలేజీ వద్ద ఉదృతంగా ప్రవహిస్తుంది. సాయంత్రంలోగ మరింత వర్షం పడితే రోడ్డు పూర్తిగా తెగిపోయే ప్రమాదం
ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్‌లో కొన్నాళ్లుగా వర్గపోరు తగ్గేదే లేదన్నట్టుగా సాగుతోంది.ఉపఎన్నిక తర్వాత అది మరీ ఎక్కువైందనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. పలు అంశాల్లో రెండు వర్గాలు ఆధిపత్యపోరు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగార్జున సాగర్ పర్యటన గ్రూప్ వార్‌కు చెక్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్‌పై ఎవరికి వారుగా…
ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలిచిన ఆ నియోజకవర్గం TRSలో గ్రూప్‌ఫైట్ మొదలైందా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు రాజుకుందా? గ్రూపులు యాక్టివ్ అవుతున్నాయా? ఏంటా నియోజవర్గం? ఎవరా నాయకులు? భగత్‌పై అసంతృప్తులు.. వ్యతిరేక సెగలు..!ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్. ఆ మధ్య ఉపఎన్నిక రావడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపై నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు నోముల భగత్ గెలిచారు. ఆ పోరు ముగిసిన 8 నెలలకే…
తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ ఎగువ భాగాన లాంచీ లో తెలంగాణ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోంది. పోచంపల్లి కి అంతర్జాతీయ టూరిజం విలేజ్ గా గుర్తింపు రావడం మనకు గర్వకారణం అన్నారు. నాగార్జున సాగర్ లో బుద్ధవనంకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు. మల్లెపల్లి లక్ష్మయ్య స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాక…
తెలుగు రాష్ట్రాల రైతులకు కల్పతెరువుగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించి నేటితో 66 ఏళ్లు పూర్తవుతోంది. 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ డ్యాం నిర్మాణం 1970లో పూర్తయింది. కృష్ణానదిలపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతిపెద్దది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమశక్తి ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు అసువులు కూడా బాశారు. ప్రపంచంలో…