తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ ఎగువ భాగాన లాంచీ లో తెలంగాణ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోంది. పోచంపల్లి కి అంతర్జాతీయ టూరిజం విలేజ్ గా గుర్తింపు రావడం మనకు గర్వకారణం అన్నారు. నాగార్జున సాగర్ లో బుద్ధవనంకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు.
మల్లెపల్లి లక్ష్మయ్య స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాక బుద్ధవనం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటుందోన్నారు. మిగిలిపోయిన బుద్ధవనం పనులు పూర్తిచేస్తాం. యాదాద్రి,కాళేశ్వరం,రామప్ప టెంపుల్, బుద్ధవనం,సోమశిల,నాగార్జునసాగర్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయన్నారు మంత్రి. నాగార్జునకొండ, శ్రీశైలం టూరిజం ను రెండు తెలుగురాష్ట్రాల పరిధిలో అభివృద్ధి చేయాల్సి వుందన్నారు.