కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
Telangana: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట నాగార్జున సాగర్. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, అలాగే ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలంటి ప్రాజెక్ట్ కు ఇప్పుడు నీటి కష్టాలు వచ్చాయి. తీవ్ర వర్షం పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాలూ అడుగంటుతున్నాయి. డ్యామ్ లో డెడ్ స్టోరేజ్…
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్‌లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.