Sagar Highway: తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు ఏరులై పారుతున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షానికి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలుజిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించింది.
పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతుండగా.. ఏకంగా 45 ఏళ్ల తర్వాత ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకుతుంది.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్రమంగా పెద్ద చెరువులోకి వర్షంనీరు వస్తుంది.. ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం చెరువులోకి వస్తాయి వర్షం నీరు.. మొదట ఆకులమైలారం చెరువు నుంచి ప్రారంభమయ్యే వరద.. గుమ్మడవెల్లి.. ఎలిమినేడు మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు చేరుతుంది.. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో 40 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత అలుగు పారడం ప్రారంభమైంది. దీంతో హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే పై కారపోకలు బంద్ అయ్యాయి. నాగార్జున హైవే పై నీరు ప్రమాదకరంగా పారుతుండటంతో.. అప్రమత్తమైన అధికారులు బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ మళ్లించారు.
హైద్రాబాద్ -నాగార్జున సాగర్ ప్రధాన రహదారి రోడ్ శ్రీఇందు కాలేజీ వద్ద ఉదృతంగా ప్రవహిస్తుంది. సాయంత్రంలోగ మరింత వర్షం పడితే రోడ్డు పూర్తిగా తెగిపోయే ప్రమాదం పొంచిఉంది.అలా జరిగితే వాహనాల రాకపోకలు సాగర్ రోడ్డుపైన పూర్తిగా స్తంభించిపోతాయి. కిలోమీటర్ల కొలది వాహనాలు రోడ్డుపైనే నిలిచి పోవాల్సి వస్తుంది. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేకుంటే రోడ్డు తెగిపోయే ప్రమాదం వుందని నాగార్జున సాగర్ వైపు వెళ్లే ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also:T20 World Cup : తొలిపోరులోనే శ్రీలంకపై నమీబియా ఘన విజయం
ఎగువన కురుసిన వర్షాలకు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. జల దిగ్బంధంలోకి ఏడు పాయల ఆలయం వెళ్లింది. వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాయి. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరానది ప్రవహిస్తుంది.
మలక్ పేట, చార్మినార్, రాజేంద్రనగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, అంబర్ పేట్, ఎల్బీనగర్, హయత్ నగర్, రామాంతపుర్, ఉప్పల్, బేగంపేట్, అమీర్ పేట్, మైత్రివనం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మెహదీపట్నం, ఎస్ ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి లో అత్యధికంగా 5.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమైదైంది. హయత్ నగర్‌లో 3.9 సెంటీ మీటర్లు , జూ పార్క్ వద్ద 3.7 సెంటీమీటర్లు, బండ్ల గూడలో 3.1 సెంటీ మీటర్లు, దూధ్ బౌలిలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన అమిత్ షా.