పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఢీకొట్టారు. హోరాహోరీగా సాగుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండిపోయారు. బరిలో లేరు.. సరే! బైఎలక్షన్‌లో ఎవరికి మద్దతిస్తున్నారు? లోకల్ కేడర్‌నే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం వెనక ఇంకేదైనా కారణం ఉందా? వారు ఇస్తున్న సంకేతాలకు అర్థమేంటి? లెట్స్ వాచ్! సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు లెఫ్ట్ పార్టీలు జైకొట్టాయా? ఈ నెల 17నే నాగార్జునసాగర్‌లో పోలింగ్. ప్రచారం పీక్‌కు వెళ్లిన సమయంలో లెఫ్ట్ పార్టీలు నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా వేడి…
నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్…
ప్రస్తుతం తెలంగాణ మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వైపు చూస్తుంది. అయితే ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు అని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. అందులో ”నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నోముల…