ఈనెల 23న తెలంగాణ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నందికొండ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిపై కీలక అంశాలను పేర్కొన్నారు. 1952లో అప్పటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడిగా తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని… ఈ మేరకు ప్రాజెక్టు నివేదిక రిపోర్టును బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను…
భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం నాగార్జున సాగర్‌కు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు క్రస్ట్ గేట్లను అధికారుల ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 64.000క్యూసెక్కులు ఉండా, అవుట్ ఫ్లో కూడా 64.000క్యూసెక్కులు ఉంది. అయితే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 311.7462 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ హౌస్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిథిలోని పవర్ హౌస్‌లను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి గట్టున ఉన్న పవర్ హౌస్‌ను, సాగర్ కుడి కాల్వ మీదున్న పవర్ హౌస్‌ను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం తన పరిధిలోని పవర్ హౌస్‌లను అప్పగించాకే ఏపీ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని షరతు విధించింది.…
తెలుగు రాష్ట్రలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తోడు ఎగువ నుండి కూడా కొంత ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. అయితే ఇప్పటికే సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 63,080 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 6…
జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వానికి తెరపడే పరిస్థితి కనిపించడంలేదు.. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్‌ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113…
ఎగువన ఉన్న శ్రీశైలం డ్యామ్ హిట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో… నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. దాంతో సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 1,27,316 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అవుట్ ఫ్లో గా 1,33,137…
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్.. ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన పలు విమర్శలు చేశారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, జానారెడ్డి మాటతప్పి నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. దేశానికే ఆదర్శంగా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని, 12 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని…