నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం ముగిసింది. నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ.. ఈ డ్యామ్ నిర్వహణను కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ కు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్భంగా వివాదం తలెత్తింది.
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. నిన్న రాత్రి ఏపీ పోలీసులు మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గుర్రంపోడు మండలం పాల్వాయి శివారులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలను సీఎల్పీ నేత కలిశారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర్‌ఘాట్ వద్ద వీరు ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు.
Off The Record: నోముల భగత్.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార్జున సాగర్ నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య కుమారుడు భగత్ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి ఉపఎన్నికలోనే ఎంసీ కోటిరెడ్డి టికెట్ ఆశించారు. కానీ.. పార్టీ పెద్దల…