సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ సాగుతోంది.. సీఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇక, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నమాట.. ఇక, రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన…
ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… టికెట్ల వివాదంతో పాటు మరికొన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించింది.. దీనిపై స్పందించిన సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు సన్మానం చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.. అయితే, సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరిని తప్పుబట్టారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న ఆయన..…
రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన.. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు…
ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు. అహంభావానికి,…
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ…
తెలుగు సినీ ప్రముఖులు-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… మంగళగిరిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌రెడ్డిది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అంటూ మండిపడ్డారు.. సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసిన ఆయన.. సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారని సెటైర్లు వేశారు.. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి?…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్టాపిక్గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి…
ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం…