మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేప పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అంధకారంలోకి వెళ్లిపోతున్న ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకోవాలని కోరారు. 2019 ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
Kollu Ravindra: మూడేళ్లలో 37 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు
రాజకీయంగా జనసేన పార్టీ రూపంలో ఒక క్లీన్ ప్లాట్ ఫామ్ మెగా అభిమానులకు ఉందని.. పార్టీని గెలిపించుకుని పవన్ కళ్యాణ్‌ను మఖ్యమంత్రి చేయడానికి అంతా కలసి రావాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ ప్రయాణంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేకుండా కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అభిమాన సంఘాలుగా అందరి ఆలోచనల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు. 100 శాతం జనసేన జెండాలు మోసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని నాదెండ్ల మనోహర్ కోరారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.
మెగా అభిమాన సంఘాల నాయకులతో జనసేన PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమావేశం
Video link : https://t.co/Lus8Fc9AwQ pic.twitter.com/UNmDidt7l6
— JanaSena Party (@JanaSenaParty) June 5, 2022