Janasena: సీబీఐ దత్తపుత్రుడిది పాలనా..? వడ్డీ వ్యాపారమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నారా..? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా..? అని ఫైర్ అయిన ఆయన.. రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు.. అసలే, గిట్టుబాటు ధరలు రాక.. పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తారా? 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం దారణమైన విషయం అన్నారు. అసలు-వడ్డీ కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం, భవిష్యత్తులో పంట నష్ట పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అనాలా..? అంటూ నిలదీశారు.
Read Also: Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
గత నెలలో ఆస్తి పన్ను కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేశారు.. ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారు.. ఇప్పుడు రైతుల మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల.. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారు.. గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారు.. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ డబ్బులను మూడు రోజుల్లో వేస్తామని ఊరూరా చెప్పిన సీబీఐ దత్తపుత్రుడు.. వారాలు, నెలలు గడిచినా డబ్బులు చెల్లించడం లేదన్నారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు- రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికీ వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు.. వీరిని ఆదుకొనే ఉద్దేశం లేని ఈ ప్రభుత్వం వసూళ్లు మాత్రం వడ్డీతో సహా చేస్తోందని.. వడ్డీ వ్యాపారం విడిచిపెట్టి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!