Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhindi Red Chilli Pachadi: నోరూరించే రుచులు, అమ్మ చేతి వంటలు ఎప్పుడూ ప్రత్యేకమే.. రోజూ బెండకాయతో మామూలు ఫ్రై లేదా పులుసు తిని బోర్ కొట్టిందా.? అయితే ఈసారి నోటికి కారకారంగా, పుల్లపుల్లగా తగిలే ‘ఘుమఘుమలాడే బెండకాయ ఎండుమిర్చి పచ్చడి’ ట్రై చేయాల్సిందే.!వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, బెండకాయ పచ్చడి వేసుకొని, పక్కన ఒక ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటే… అబ్బో ఆ రుచే వేరు, నోట్లో నీళ్లు ఊరాల్సిందే. తక్కువ సమయంలో, చాలా సులభంగా చేసుకునే ఈ టేస్టీ పచ్చడి ఎలా తాయారు చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* బెండకాయలు: పావు కిలో
* టమాటాలు: 4
* ఎండుమిరపకాయలు: 12
* పచ్చిశెనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* ధనియాలు: ½ టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు: 8
* చింతపండు: చిన్న ఉసిరికాయ సైజు
* కరివేపాకు: 3 రెమ్మలు
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
* తాలింపు గింజలు: 1 టీస్పూన్
* ఉప్పు: రుచికి తగినంత
Also Read
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
తయారీ విధానం:
మొడత్తాగా స్టవ్ మీద పాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కాక కట్ చేసిన ఎండుమిరపకాయలు, పచ్చిశెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, 3 రెమ్మల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మరో టీస్పూన్ ఆయిల్ వేసి, శుభ్రంగా కడిగి తడి తుడిచిన బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి కలిపి, మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మొదట మిక్సీ జార్లో వేయించిన ఎండుమిరపకాయలు, దినుసులు, వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
చివరగా వేయించిన బెండకాయ ముక్కలు వేసి, మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి మాత్రమే (కచ్చాపచ్చాగా/బరకగా) తిప్పుకోవాలి. బెండకాయ ముక్కలు చివర్లో వేస్తేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు పాన్‌లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి.
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!