వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని…
అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూలై 2న వీర మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని నాదెండ్ల మనోహర్…
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని…
ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర…
జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు రానున్నాయని నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. మార్చిలోనే ఎన్నికలు జరగబోతుండటంతో జనసైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది వ్యక్తిగత లబ్ధి కోసం కాదని.. ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన పార్టీ పెట్టారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.…
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేప పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అంధకారంలోకి వెళ్లిపోతున్న ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకోవాలని కోరారు. 2019 ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ…
మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్ పర్యటన వుంటుందన్నారు. ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ…