చెరుకుపల్లి ప్రజసభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసైనికుల బలం ఈ సభతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రస్థానం.. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసం అన్నారు. అకాల వర్షాలు వరదల తో రాష్ట్రం లో రైతులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రం లో రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారో ప్రభుత్వం చెప్పాలి. 70 శాతం ప్రజలు రైతాంగం పై ఆధారపడి ఉన్నారు. జీవో 217 తీసుకువచ్చి మత్స కార కుటుంబాలలో చిచ్చు పెట్టింది ఈ…
రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతుల పాదయాత్రలో గాయాల పాలైనవారికి.. చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు…
కేంద్రం తరహాలోనే ఏపీ కూడా పెట్రో ఉత్పత్తులపై తన వాటా వ్యాట్ ను తగ్గించుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ అన్నారు. పెట్రో రేట్లు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుందా లేదా అన్నారు. కేంద్రం బాటలోనే ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తు ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాయిన్నారు. అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7…
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం…
పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యక్రమానికే కోవిడ్ రూల్సా..? సీఎం జగనుకు కోవిడ్ రూల్స్ వర్తించవా..? అని మండిపడ్డారు.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్‌లో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ఎందుకు వర్తింపచేయడం లేదని నిలదీసిన ఆయన.. విజయవాడను దిగ్బంధించి మరీ వేల మందితో చెత్త…
అమరావతి : జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ అని… స్వప్రయోజనాల కోసం ప్రధాని మోడీని పవన్ కలవలేదన్నారు నాదెండ్ల మనోహర్. ఇతర ప్రతిపక్షాల గురించి మనకు అనవసరం.. తామే ప్రతిపక్షమన్నారు. ఇసుక, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాల విషయంలో గట్టిగా పోరాడింది జనసేనేనని… జగన్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.కోవిడ్ సందర్భంలో ఒక్క చోటైనా సీఎం జగన్…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని సమస్యలపై ఆయన పోరాటం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళుతున్న సంగతి తెల్సిందే. ఇక ఆపార్టీకి చెందిన ముఖ్య నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అయితే గత సార్వత్రిక…
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.