95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు 'ప్రిడిక్షన్స్' ప్రకటించాయి. 'లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్" వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి.
రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన "నాటు నాటు..." అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు.
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది.
ఈరోజు జరగనున్న ఆస్కార్స్ వేడుకపై ప్రతి భారతీయుడు దృష్టి పెట్టాడు. ముందెన్నడూ లేనంతగా ఆస్కార్స్ ఈవెంట్ ని చూడడానికి ఇండియన్స్ ఈగర్ గా వెయిట్ చెయ్యడానికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్స్’కి నామినేట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని వెస్ట్రన్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చెయ్యడంలో కీ రోల్ ప్లే చేసింది నాటు నాటు…
ఈ సారి భారతీయులకు 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు..." సాంగ్ ఎంత ఆనందం పంచిందో, అదే తీరున 'ఆస్కార్ నామినేషన్' సైతం సొంతం చేసుకొని మరింత ఉత్సాహాన్ని ఉరకలేయిస్తోంది.