Oscar Awards: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ‘ప్రిడిక్షన్స్’ ప్రకటించాయి. ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్” వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి. చిత్రమేమిటంటే- ఈ ప్రిడిక్షన్స్ చెప్పిన ఐదు ప్రముఖ సంస్థలూ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు…నాటు…” పాటకే పట్టం కట్టాయి. అదే విధంగా ఫలితమూ దక్కింది. ప్రిడిక్షన్స్ ను కొట్టి పారేయరాదని మరోమారు రుజువయింది.
Read Also: RRR: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. చరిత్ర సృష్టించిందన్న రాజకీయ ప్రముఖులు
ఇక ఆస్కార్ అవార్డ్స్ లో ‘బిగ్ ఫైవ్’గా భావించే “బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్, అడాప్టెడ్)” విభాగాల్లో ఒక్క సంస్థ ‘ప్రిడిక్షన్స్’ మినహాయిస్తే – అన్నీ మిగతా సంస్థలు ఊహించినట్టుగానే ఫలితాలు రావడం విశేషం! బెస్ట్ పిక్చర్ గా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’, అదే చిత్రానికి దర్శకత్వం వహించిన డేనియల్ క్వాన్, డేనియల్ స్వెయినెర్ట్ బెస్ట్ డైరెక్టర్స్ గా నిలిచారు. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలోనూ డేనియల్ క్వాన్, డేనియల్ స్వెయినర్ట్ ఆస్కార్ ను అందుకోవడం విశేషం! ఈ సినిమాలో నటించిన మెచల్లీ యెవోహ్ ‘బెస్ట్ యాక్ట్రెస్’గా ఆస్కార్ ను అందుకోగా, ‘ద వేల్’ లో తన నటనకు గాను బ్రెండాన్ ఫాసర్ ‘బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను కైవసం చేసుకున్నారు. ‘విమెన్ టాకింగ్’ సినిమాతో బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో సారా లీ విజేతగా నిలిచారు. ఆ తీరున ‘బిగ్ ఫైవ్’లో నాలుగు అవార్డులను (బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే) సొంతం చేసుకొని ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ 95వ ఆస్కార్ అవార్డుల్లో చరిత్ర సృష్టించింది. ఈ ఐదు విభాగాల్లో ప్రిడిక్షన్స్ నిజం కావడం గమనార్హం!
Read Also: Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్.. కేసీఆర్ హర్షం..
మిగిలిన విభాగాల్లోనూ చాలావరకు ఈ ఐదు సంస్థలు చెప్పిన ప్రిడిక్షన్స్ ఫలించాయి. అయితే “బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్” విభాగాల్లోనే ఈ సారి వెలుగు చూసిన ప్రిడిక్షన్స్ లో ఒక్కో సంస్థ ఒక్కోలా చెప్పింది. కానీ, ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ సంస్థ ప్రకటించిన ఊహించిన ఫలితాల జాబితాలో దాదాపు 85 శాతం నిజం కావడం గమనార్హం!