పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఎందుకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై…
జగదీప్ ధన్‌ఖర్.. జూలై 21 సాయంత్రం వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి. ఆరోజే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభలో ధన్‌ఖర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
రీల్ జీవితానికి.. రియల్ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలో కూడా చేస్తే జీవితాలు బుగ్గిపాలవుతాయి. సినిమా అనేది వినోదం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని మెప్పించేందుకు ఏవేవో చూపిస్తారు. అందులో వాటిని పాలైతే మాత్రం కటకటాల పాల్వడం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? యూపీలో అచ్చం సినిమా తరహాలోనే ఒక హత్య జరిగింది.
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ…
మెదక్ జిల్లా శివంపేట మండలం సామ్యతండాలో ఈ నెల 2న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో సొంత బాబాయ్‌ను అన్న కొడుకే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మదన్ లాల్‌ని కత్తులతో భారత్ సేన్(24) పొడిచి చంపాడు.
వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 23న ముగ్గురు మహిళలు చిన్నారి అద్వితను అపహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పది రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. రాష్ట్ర సరిహద్దులు దాటిందన్న అనుమానంతో పోలీసుల విస్తృత గాలింపు…
డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసులు. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వీడనుంది. మృతదేహాన్ని పార్సల్ చేసి పోలీసులను ముప్పు తిప్పులు పెట్టిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
Gun Fire : నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు…
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి మిస్సింగ్ అయిన యువతి కేసు మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. హాస్టల్ నుంచి తన మామయ్య ఇంటికి అని బయలుదేరిన విద్యార్థిని మధ్యలోనే అదృశ్యం అయింది. మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినా నేటికీ జాడ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టిరీగా మారింది. 4వ తరగతి విద్యార్థిని అదృష్యమై తొమ్మిది రోజులైనా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కోసం అమ్మమ్మ, తాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.