UP: సినిమా తరహాలో స్కెచ్.. పగతో 10 ఏళ్ల తర్వాత హత్య.. అసలేం జరిగిందంటే..!
- సినిమా తరహాలో స్కెచ్
- పగతో 10 ఏళ్ల తర్వాత హత్య
- వీడిన లక్నో మర్డర్ కేసు మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీల్ జీవితానికి.. రియల్ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలో కూడా చేస్తే జీవితాలు బుగ్గిపాలవుతాయి. సినిమా అనేది వినోదం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని మెప్పించేందుకు ఏవేవో చూపిస్తారు. అందులో వాటిని పాలైతే మాత్రం కటకటాల పాల్వడం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? యూపీలో అచ్చం సినిమా తరహాలోనే ఒక హత్య జరిగింది.
ఇది కూడా చదవండి: Asim Munir: అసిమ్ మునీర్.. మరో ముషారఫ్ కానున్నారా?.. పాక్‌లో ఏం జరుగుతోంది?
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
పదేళ్ల క్రితం తల్లిని అవమానించినప్పుడు ఆ పిల్లలు చిన్నవాళ్లు. కానీ మైండ్‌లో ముద్ర పడిపోయింది. తన తల్లిని కొట్టి.. అవమానించిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలని ఎప్పుటినుంచో ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తుండగా 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి కనిపించాడు. చంపేందుకు తన శక్తి సరిపోకపోవడంతో స్నేహితుల సాయం కోరి మరీ చంపేశాడు. మూడు నెలల క్రితం లక్నోలోని కల్యాణ్‌పూర్‌లో జరిగిన హత్య కేసులో నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Pappu Yadav: ప్రధాని పోస్ట్‌ను క్షణంలోనే తిరస్కరించారు.. రాహుల్‌గాంధీ మేధావి అంటూ పప్పు యాదవ్ ప్రశంసలు
10 ఏళ్ల క్రితం మనోజ్ అనే వ్యక్తి సోను కశ్యప్ తల్లిని కొట్టి.. అవమానించాడు. అప్పుడు సోను చిన్నపిల్లాడు. అయితే తన తల్లిని కొట్టిన వ్యక్తిపై పగతో రగిలిపోతున్నాడు. పదేళ్ల నుంచి మనోజ్ కోసం వెతుకుతున్నాడు. మూడు నెలల క్రితం నగరంలోని మున్షిపులియా ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. అంతే అప్పటినుంచి చంపేందుకు సోను స్కెచ్ గీస్తున్నాడు. ధైర్యం సరిపోక.. పెద్ద పార్టీ ఇస్తానంటూ స్నేహితుల్ని ఉసిగొల్పాడు. అంతే మనోజ్‌ను చంపేందుకు సై అన్నారు. మనోజ్.. కొబ్బరినీళ్లు విక్రయిస్తుంటాడు. మే 22న కొబ్బరినీళ్లు అమ్మి తిరిగి ఇంటికి వస్తుండగా సోను బృందం రాడ్లతో విరుచుకుపడ్డారు. చనిపోయాడని పారిపోయారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ చనిపోయాడు.
హత్య జరిగిన తర్వాత సీసీటీవీలో నారింజ రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి ఫొటో రికార్డైంది. అయితే సోను.. తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన తర్వాత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటికే నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు సోషల్ మీడియాలో కనిపించిన ఫొటోలకు నిందితుడు షర్ట్ సరిపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర బయటకు వచ్చింది. నిందితులు సోను, రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిని అవమానించాడనే మనోజ్‌ను సోను చంపేశాడని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!