వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 23న ముగ్గురు మహిళలు చిన్నారి అద్వితను అపహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పది రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. రాష్ట్ర సరిహద్దులు దాటిందన్న అనుమానంతో పోలీసుల విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
READ MORE: CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలకు కూడా పోలీసులు తనిఖీలకు వెళ్లారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 22 మంది పోలీసులతో కలిపి ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక విచారణ చేపడుతున్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో బాలిక అపహరణ గురైన సమయంలో కాల్ డాటాని కూడా సేకరించారు. 42 వేలకు పైగా ఫోన్ కాల్స్ ని గుర్తించి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.