మెదక్ జిల్లా శివంపేట మండలం సామ్యతండాలో ఈ నెల 2న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో సొంత బాబాయ్‌ను అన్న కొడుకే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మదన్ లాల్‌ని కత్తులతో భారత్ సేన్(24) పొడిచి చంపాడు. హత్యకు భారత్ సేన్.. తన ఫ్రెండ్ నవీన్ సాయం తీసుకున్నాడు. మెడ మీద కాలు పెట్టి తొక్కి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత భారత్ సేన్, నవీన్ కారులో పారిపోయారు. గతంలో అన్నదమ్ములు మదన్ లాల్, తారా సింగ్ మధ్య భూ వివాదం ఉన్నట్లుగా తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి లక్షల్లో నెల జీతం, ఫ్లాట్!