ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన శుభలేక చర్చనీయాంశమైంది. కార్డు ప్రసిద్ధి చెందడానికి కారణం దానిపై ముద్రించిన చిత్రం. ఆ చిత్రాన్ని చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని అమేథీలో ముస్లిం కుటుంబానికి చెందిన ఓ కుమార్తె పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు, దేవత ఫొటోలు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది.
Bagoriya Mataji Temple: అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయం గురించి ఈ రోజు మనం చూద్దాం. ఇందులో భాగంగా.. ఒకగుడిలో హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా అమ్మవారిని పూజిస్తారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని భోపాల్‌ఘర్ ప్రాంతంలోని బగోరియా గ్రామం కొండపై ఉన్న మాతాజీ ఆలయం మత సామరస్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. బగోరియా దేవి ఆలయంలో, ఒక సింధీ ముస్లిం కుటుంబం 13 తరాలుగా మాతృ…