మీ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ బీజేపీ, తెలంగాణను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేరని ఒకరినొకరు మాటలయుద్ధం జరుగుతుంది. ఈనేపథ్యంలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ ఫైర్ అయ్యారు.
సోమవారం రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారని అన్నారు. ర్యాలీ, సభ ఉంటుందని, బండి సంజయ్, తరుణ్ చుగ్ హాజరు అవుతారని అన్నారు. రేపు మునుగోడు కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు.
CPM leaders will meet with KCR: సీఎం కేసీఆర్‌తో సీపీఎం నేతలు నేడు భేటీకానున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు ప్రకటించిన తరవాత తొలిసారి సీఎంతో సమావేశం అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. దీంతో ఇవాళ రాత్రి 7 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు.…