Vivek Venkatswamy: బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, అసెంబ్లీ ఇంఛార్జి ల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర సహ ఇంచార్జ్ అరవింద్ మీనన్ హాజరయ్యారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక, పార్లమెంట్ ప్రవాస యోజన, బైక్ ర్యాలీ లు ఇతర అంశాలపై చర్చించనున్నారు. రేపు మునుగోడులో బీజేపీ పోలింగ్ బూత్ ఇంఛార్జీలతో తరుణ్ చుగ్ భేటీ కానున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ , వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎల్లుండి మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీలపైన కేటీఆర్ ఆరోపణలు సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎక్కువ ధరకు ప్రాజెక్టులు కట్టబెట్టిందని అన్నారు.
ఎక్కువ ధరలకు కేటాయించడం వల్ల 29 వేల కోట్లు జెన్ కో, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 4 కాంట్రాక్టులు రాజ్ గోపాల్ రెడ్డికి దక్కాయని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం వల్ల రాలేదు.. కేటీఆర్ గ్రహించాలని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ మునుగోడులో గెలుస్తుందనే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ పై రాజ్ గోపాల్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానన్నారు అని తెలిపారు. TRS ఓడిపోతుందనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 86 మందిని బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారని అన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు కోసం రిటర్నింగ్ అధికారిని సమయం ఆడిగామని, సోమవారం రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారని అన్నారు. ర్యాలీ, సభ ఉంటుందని, బండి సంజయ్, తరుణ్ చుగ్ హాజరు అవుతారని అన్నారు. రేపు మునుగోడు కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ , వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..