మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంను ప్రగతిభవన్‌లో అందజేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్ ర�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నంత పని చేశాడు.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో తమ పార్టీని అభ్యర్థిని పోటీకి పెట్టబోతున్నారు.. మునుగోడు ఉపఎన్నిలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్ పేరును ప్రకటించారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గద్దర్.. రేపటి నుంచ�
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.