మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని.. అక్కడ హస్తం పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ఆమె ప్రకటించారు. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్లాలి అనడానికి తప్పకుండా వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామన్నారు.
కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చా�
తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు.
మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయో.. రావో.. నిర్ణయించేందుకు ఆ ప్రాంత ప్రజలే.. కానీ, మునుగోడుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముడిపడి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైన తరుణంలో.. ఆపేందుకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, రాజగో�