Tallest Buildings: ఏ దేశంలో అయినా మహానగరాలు అనగానే అందరికీ ఎత్తైన భవనాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే మహానగరాలలో మాత్రమే అంతటి ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇస్తారు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎత్తయిన భవనాలు కనిపిస్తాయి. అయితే విదేశాలలో ముఖ్యంగా దుబాయ్ లాంటి నగరాలల్లో ఎత్తయిన భవనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో అత్యధిక ఎత్తయిన భవనాలు ఉన్న నగరం గురించి చాలా మందికి తెలియదు. 200 మీటర్లు…
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల 26/11 తరహా దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు పాకిస్థాన్ నుంచి మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకుంటే హోటల్‌ను పేల్చేస్తామని అగంతుకులు ఫోన్ కాల్స్ చేశారు.
ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతామంటూ అగంతుకులు నుంచి బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నంబరుకు పాకిస్థాన్ కోడ్ ఉండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్రదాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది.
మహారాష్ట్ర ముంబైలోని బోరివాలిలో ఇవాళ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. బోరివాలి వెస్ట్‌లోని సాయిబాబా నగర్లో భవనం కుప్పకూలగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేపట్టారు.
Missing Girl Is Reunited With Her Family After 9 Years.విధి ఎంత విచిత్రంగా ఉంటుందంటే.. ఏడేళ్ల వయసులో కిడ్నాప్ కు గురైనా బాలిక, తన తల్లిదండ్రులు నివసించే ఏరియాలో కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నా, తన కుటుంబాన్ని కలవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. వివరాల్లోకి వెళితే జనవరి 22, 2013లో ముంబై అంధేరిలో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలిక పూజ, అతని సోదరుడితో స్కూలుకు వెళ్లింది. ఈ క్రమంలో హెన్రీ డిసౌజా అనే వ్యక్తి…
TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు…
Woman Missing For 20 Years Was found In Pak : 20 ఏళ్ల క్రితం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాాలకు వెళ్లిన మహిళ తప్పిపోయింది. 20 ఏళ్లుగా మహిళ గురించి వెతికినా.. కుటుంబ సభ్యులు ఆచూకీ కనిపెట్ట లేకపోయారు. తాజాగా ఆ మహిళ ఆచూకీని పాకిస్తాన్ లో కనుగొన్నారు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా పుణ్యామా అని సదరు మహిళ తమ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఏర్పడింది.
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు.