Mumbai: నవీముంబై.. అర్ధరాత్రి.. అందరు కునుకులోకి జారుకున్నారు.. నిశబ్దంగా ఉన్న రోడ్లపై గాలికి ఊగుతున్న ఆకుల సౌండ్ తప్ప ఏమి వినిపించడం లేదు. ఆ సమయంలో నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చాడు ఒక స్థానికుడు.. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు.. కింద రోడ్డు మీద ఒక వ్యక్తి నగ్నంగా.. చేతిలో ఏదో పట్టుకొని రావడం చూసి స్టన్ అయిపోయాడు. కొద్దిగా ధైర్యాన్ని కూడబెట్టుకొని ఎవరు.. అక్కడ.. ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచాడు. ఇక ఆ మాటలు విన్న నగ్న వ్యక్తి పరుగు లంఖించుకున్నాడు. కృష్ణవాడి, సంజయ్ గాంధీ నగర్ ,అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో నిత్యం అర్ధరాత్రి జరుగుతున్న తంతే ఇది. ఎవరో గుర్తుతెలియని ఒక వ్యక్తి అర్ధరాత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా కాలనీలో సంచరిస్తూ కనిపిస్తున్నాడు. పట్టుకుందామని చూసే లోపు పారిపోయాడు. అసలు ఎవరు అతను.. దేనికోసం వస్తున్నాడు. సీరియల్ కిల్లరా..? రేపిస్టా..? అనేది మిస్టరీగా మారింది.
ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో అర్ధరాత్రి, తెల్లవారు జామున పిల్లలు, గృహిణులు బయటికి రావడం మానేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని స్థానికులు తెలుపుతున్నారు. ఇక ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చామని, కానీ , పోలీసులు అలాంటివేమీ ఉండవు.. ఏదో బ్రహ్మ పడుతున్నారని అన్నారు. ఆ తరువాత నగ్న వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కనిపించేసరికి పోలీసులు సైతం వెంటనే అలర్ట్ అయ్యి ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో పడుకుంటున్నామని, ఆ వ్యక్తి ఎవరు..? ఎందుకు వచ్చాడు అనేది పోలీసులు త్వరగా తెలుసుకుంటే మంచిదని స్థానికులు తెలుపుతున్నారు.