mumbai drugs: రూ.1,476కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న డీఆర్ఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
mumbai drugs: మహారాష్ట్ర నవీ ముంబయిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ (ఐస్), 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని చెప్పారు.
Read also: america floods: అమెరికాలో ఇయాన్ బీభత్సం.. 54మంది మృతి
Also Read
ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. గత 12 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. సెప్టెంబర్ 12న తనిఖీలు చేస్తున్న సమయంలో పండ్ల ట్రక్కులో డ్రగ్స్‌ను గుర్తించారు. పండ్ల డబ్బాల్లో డ్రగ్స్‌ను దాచిపెట్టి కొత్త విధానంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని.. దిగుమతిదారుడిని పట్టుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అక్రమ రవాణా సూత్రధారుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: ashok gehlot: సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ఇక, క్రిస్టల్ మెథాంఫేటమిన్ అనేది సింథటిక్ డ్రగ్, చాలా అడిక్టివ్. క్రిస్టల్ మెథాంఫేటమిన్ అధిక స్వచ్ఛత స్థాయిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక, తీవ్రమైన శారీరక ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ధూమపానం లేదా డ్రగ్‌ను ఇంజెక్ట్ చేసుకునే వారు తీవ్రమైన అనుభూతిని అనుభవిస్తారు. గరిష్టంగా 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆ ప్రభావం ఉంటుంది. ఇక, దక్షిణాఫ్రికా నుంచి వాలెన్సియా ఆరెంజ్‌ల మధ్య డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నారని.. స్మగ్లర్లు ముంబైని ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చుకుని యూరప్ దేశాలకు లేదా యుఎస్‌కు సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, డీఆర్‌ఐ అధికారులు ఇందుకు సంబంధించి దిగుమతిదారుని అరెస్టు చేశారు. అతనిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ రాకెట్‌లో పాల్గొన్న కస్టమ్స్ హౌస్ ఏజెంట్, సిండికేట్ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!