Drugs and gold seized at Mumbai airport: మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి విమానాశ్రయాలు, పోర్టులు. ఇటీవల కాలం దేశంలో పలు విమానాశ్రయాల్లో అక్రమంగా ఇండియాలోకి తీసుకువస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. అధికారుల కళ్లుగప్పి నిషేధిత డ్రగ్స్ ను ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఇండియాలోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి బంగారాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా మనదేశంలోకి తీసుకువస్తూ పట్టుబడుతున్నారు.
Read Also: Mulayam Singh Yadav: ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
తాజాగా ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం, డ్రగ్స్ పట్టుబడ్డాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద రూ.5 కోట్ల విలువ చేసే 10 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. వేరు వేరు విమానాలలో ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ప్రయాణికుల వద్ద బంగారాన్ని గుర్తించారు అధికారులు. లగేజ్ బ్యాగ్, జాకెట్స్, కడుపులో దాచి బంగారాన్ని తరలించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. కస్టమ్స్ స్కానింగ్ లో ఈ అక్రమ బంగారం వ్యవహారం బయటపడింది. బంగారాన్ని సీజ్ చేసి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు.
మరోవైపు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 34.79 కోట్ల విలువ చేసే 5 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. అధికారులను బురిడీ కొట్టించేందుకు హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. అయితే ఈ విషయాన్ని అధికారులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.