Helmetless Cops : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. టూ వీలర్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే పోలీసులు భారీ జరిమానా విధిస్తారు.
అక్రమంగా నిర్మించిన స్టూడియోలపై ముంబై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన డజన్ల కొద్దీ ఫిల్మ్ స్టూడియోలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు ప్రవేశించాయి. వీటిని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ రక్షణలో నిర్మించారని బిజెపి ఆరోపించింది.
చిన్నపిల్లలపై దెబ్బ పడితే చాలు టీచర్లపైనే ఎదురుదాడులు చేస్తున్న రోజు ఇవి. దీంతో పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా మనకేంటి అని టీచర్లు పట్టించుకోవడం లేదు. అయితే, కొందరు టీచర్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా పనిపిల్లల్లతో ఓ టీచర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది.
ముంబై లోకల్ రైళ్లు ముళ్లు లేని గులాబీల మంచం లాంటివి. దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, రైల్వే స్టేషన్లో ప్రజల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీని ఫలితంగా సెంట్రల్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొడవ జరిగింది.
Diamonds Theft: గుజరాత్లోని ప్రముఖ వజ్రాల వ్యాపారిని మోసగించిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆదివారం ప్రకటించింది. ఒక గుజరాత్ వజ్రాల వ్యాపారిని ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరిలో సంప్రదించారు.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది.
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్గా మారింది.
Crime News: రోజురోజుకు సమాజంలో మనిషి మైండ్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు..ఎలా చంపేస్తారో అని భయం మొదలయ్యింది. వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తలు.. డబ్బు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.