Salman Khan : కొత్త వ్యాపారంలోకి సల్మాన్ ఖాన్.. సముద్రం ఎదురుగా భారీ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో వ్యాపారంలో కొత్త వ్యాపారంలోకి దిగనున్నారు. ఇందుకు ముంబైలోని బీఎంసీలో విలాసవంతమైన హోటల్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం ఆయన బీఎంసీ నుంచి ప్లాన్‌కు అనుమతి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ మొదట రెసిడెన్షియల్ సొసైటీని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ ప్రస్తుతం రెసిడెన్షియల్ సొసైటీ నుంచి హోటల్ కట్టడంపై దృష్టి సారించాడు. సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా కార్టర్ రోడ్లో 19 అంతస్తుల విలాసవంతమైన హోటల్ని నిర్మించబోతున్నాడు. సల్మాన్‌ఖాన్ హోటల్‌ను నిర్మించనున్న స్థలం.. గతంలో రెసిడెన్షియల్ సొసైటీ స్టార్లెట్ సీహెచ్‌ఎస్‌కు చెందిన భూమి. సల్మాన్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్ పేరు మీద తీసుకున్నాడు.
Read Also:Rs 2,000 Notes: రూ.2వేల నోటు రద్దుతో సమస్య ఎవరికి ?
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
- AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో సముద్రానికి ఎదురుగా తన హోటల్‌ను నిర్మించనున్నారు. హోటల్ 19 అంతస్తులు ఉంటుంది. హోటల్ బ్లూప్రింట్ ప్రకారం.. భవనం మొదటి, రెండవ అంతస్తులలో ఒక కేఫ్, రెస్టారెంట్ ఉంటుంది. మూడో అంతస్తులో జిమ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నారు. కాగా, నాలుగో అంతస్తు సర్వీస్ ఫ్లోర్గా ఉంటుంది. 5, 6 అంతస్తులలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించబడుతుంది. తర్వాత ఏడో అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు హోటల్ నిర్మిస్తారు. హోటల్ నుండి సముద్రపు ప్రత్యేకంగా వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. ఈ హోటల్లో అన్ని లగ్జరీ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Read Also:Adipurush: ఒక్క పాట బిజినెస్ నే మార్చేసింది…
సల్మాన్ ఖాన్ కి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. గెలాక్సీలోని అపార్ట్‌మెంట్‌తో పాటు, అతనికి పావెల్‌లో ఫామ్‌హౌస్, గోరైలో బీచ్ ప్రాపర్టీ ఉంది. ఇది కాకుండా, అతను ఇటీవల ముంబైలోని ప్రధాన ప్రదేశం బాంద్రా వెస్ట్‌లో ఒక ప్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. అందుకు ప్రతినెలా రూ.1.5 లక్షలు చెల్లిస్తున్నాడు.
తాజావార్తలు
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!