మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. కాగా.. మిస్సింగ్ అయిన బాలికల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. తలోజా ప్రాంతంలోని లక్కీ కాంప్లెక్స్‌లో బాలికలు శనివారం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి బాలికలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. మరోవైపు బాలికల తల్లిదండ్రులు తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయారు.
Mumbai on alert after Bomb Threat Message: వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.…
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 801.67 పాయింట్లు కోల్పోయి 71,140కి పడిపోయింది. నిఫ్టీ 21550 పాయింట్లు పడిపోయి.. 215 పాయింట్లు కోల్పోయాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకోగా.. ఈరోజు అదే స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. ఉదయం గ్రీన్ మార్క్ తో ప్రారంభమైన మార్కెట్ ఎట్టకేలకు రెడ్ మార్క్ తో ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో మార్కెట్లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు…
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్వాడ్లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్‌ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Best Cities In The World: ప్రపంచంలో టాప్-50 బెస్ట్ నగరాల జాబితా విడుదలైంది. టైమ్ అవుట్ ఈ జాబితాను వెల్లడించింది. నగరంలోని ఆహారం, కల్చరల్ అట్రాక్షన్, నైట్ లైఫ్ వంటి అంశాల ఆధారంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ రెండవ స్థానంలో నిలిచింది. లండన్, బెర్లిన్ మరియు మాడ్రిడ్ వరసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి.
Mumbai: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఘర్షణ ఏర్పడింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్ "మిస్ వరల్డ్" పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీకలు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ‘‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. #మిస్ వరల్డ్ ఇండియా #బ్యూటీ విత్ పర్పస్’’ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో…
SpiceJet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో టాయిలెట్ గేటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు.
Dead Rat In Food: ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్‌కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచి క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ ఆర్డర్ చేశాడు.
ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.