బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో చేరాడన్న విషయంతో చాలామంది ఆయన గురించి వాకప్ చేశారు.
Also read: AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో ఎన్నికలు ఆ తేదీనే
ఇకపోతే ఈ విషయంపై తాజాగా అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలలో ఎటువంటి నిజం లేదనీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఇకపోతే బిగ్ బీ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్స్ కు హాజరయ్యారు. అయితే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అమితాబ్ ను మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగడంతో.. నేను బాగానే ఉన్నానని., తన అనారోగ్యం పై వస్తోన్న వార్తలన్నీ కూడా ఫేక్ అని సమాధానం ఇచ్చారు. దింతో ఆయన అభిమానులు కాస్త ఆనందపడ్డారు. బిగ్ బి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ లో బాగా హుషారుగా పాల్గొని సందడి చేశారు. అక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి మ్యాచ్ ను వీక్షించారు.
also read: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..
ఇకపోతే అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కేవలం బాలీవుడ్ మాతరమే కాకుండా.. దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. హీరో ప్రభాస్, డైరక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు బిగ్ బి. ‘కల్కి 2898 ఏడీ’ మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దింతోపాటు రజనీకాంత్ నటిస్తోన్న టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ‘తలైవా 170’ లో కూడా బిగ్ బి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.