Air India: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విషాదకర ఘటన వెలుగు చూసింది. బుక్ చేసుకున్నా వీల్ చైర్ దొరక్కపోవడంతో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ వృద్ధ ప్రయాణీకుడు మృతి చెందాడు. వీల్ చైర్ అసిస్టెంట్ లేకపోవడంతో వృద్ధుడు విమానం నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు నడవాల్సి వచ్చింది. కౌంటర్ దగ్గరకు చేరుకున్న తర్వాత ఆయన గుండెపోటుతో కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రయాణికులు వేచి ఉండాల్సిందిగా కోరినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Read Also: Keerthy Suresh: కాటుక కళ్ళతో కట్టిపడేస్తున్న కీర్తి సురేష్
అయితే, ఈ ఘటన తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్ అసిస్టెంట్ల కొరత ఎంత ఉందో తేలిపోయింది. వృద్ధ దంపతులకు ఒక్క వీల్ చైర్ అసిస్టెంట్ మాత్రమే ఇచ్చారు.. 80 ఏళ్ల వృద్ధుడు న్యూయార్క్ నుంచి ముంబైకి వెళ్లాడు.. ఎయిరిండియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు, వృద్ద దంపతులకు ఒక్క వీల్ చైర్ మాత్రమే దొరికింది.. అలాంటి పరిస్థితిలో భర్త తన వృద్ధ భార్యను అందులో కూర్చోబెట్టి.. అతను ఆమె వెనక నడిచాడు.. దాదాపు విమానం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో టెర్మినల్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గరకు వృద్ధుడు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, కౌంటర్ వద్దకు చేరుకోగానే వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఘటన అనంతరం వృద్ధుడిని కూడా నానావతి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.