తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది. మొదట్లో వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగింది. కాకపోతే చివరకి 169 పరుగుల తేడాతో విదర్భ పై నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్ గా అవతరించింది. చివరిసారిగా ముంబయి జట్టు 2015 – 16లో టైటిల్ గెలిచింది. 538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే పోటీ ఇచ్చి 368 పరుగులకే కుప్పకూలింది.
Also read: Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!
గడిచిన ఎనిమిదేళ్లలో ముంబయి రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా నిలివడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్క లో రుణ్ నాయర్ 74, అక్షయ్ వాడ్కర్ 102, హర్ష్ దూబే 65 పరుగులతో రాణించారు. ఇక ముంబయి బౌలర్ల విషయానికి వస్తే తనుశ్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్ దేశ్పాండే 2 షమ్స్ ములాని 1 వికెట్లను నేలకూల్చారు. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా విదర్భ ఒకానొక దశలో 352-5 తో గెలుపు గెలుపు వైపు ప్రయాణించింది. ఆ సమయానికి అక్షయ్ వార్కర్ (102), వార్ష్ దూబే (65) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం చేయడంతో ముంబయిని కాస్త ఆందోళనలో పడేసారు.
Also read: Viral Video : అనారోగ్యానికి గురైన కేర్ టేకర్ ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన ఏనుగు
ఈ సమయంలో తనష్ కొటియన్ 353 పరుగుల వద్ద సెంచరీ హీరో అక్షయ్ ను పెవిలియన్ కి పంపడంతో ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా కేవలం 15 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. దింతో కప్ ముంబై వశమైంది.
Emotions ☺️
Classy Gestures 🫡
A Special Triumph 🙌
This moment has it all 👏 👏
Scorecard ▶️ https://t.co/L6A9dXXPa2#RanjiTrophy | #Final | #MUMvVID | @IDFCFIRSTBank | @MumbaiCricAssoc pic.twitter.com/rV2ziXZnOV
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024