మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముంబైలో దాడికి గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుడు ఉపయోగించిన సిమ్ మహిళ పేరు మీద నమోదైందని విచారణలో తేలిందని అందుకే ఆమెను అరెస్ట్ చేశారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించి మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకురావచ్చు, తద్వారా తదుపరి విచారణ చేయవచ్చని అంటున్నారు.…
ముంబైలో మహిళపై అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి.
Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో…
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు షరీఫుల్ కు సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని నటుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి వెన్నెముకలో విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే, నిందితుడి కోసం మూడు…
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత నుంచి 30 టీములతో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Saif Ali Khan News : నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.