IPL 2023 : ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతున్న వేళ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ ఇ్దదరూ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివర్లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. లేకపోతే.. 230 ప్లస్ టార్గెట్ పక్కా అనుకున్న ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి.. 200 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై.. 70 బంతులు మిగిలుండగా ఛేదిస్తేనే ఆర్సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ వస్తుంది.
Also Read : Viral : ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం.. పోలీస్ జీప్‌పై డ్యాన్స్
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ జోడీని మార్చింది. మయాంక్ అగర్వాల్ కు తోడుగా వివ్రంత్ శర్మను తీసుకు వచ్చింది. ఈ సీజన్ మొత్తం దారుణంగా విఫలమైన హైదరాబాద్ ఓపెనింగ్ పెయిర్ ప్రయోగం ఈసారి మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఈ ఇద్దరూ కలిసి 13.5 ఓవర్లలోనే 140 పరుగుల భాగస్వామ్యం చేసింది. ఈ సీజన్ లో ఏ వికెట్ కు అయినా హైదరాబాద్ కు ఇదే హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.
పవర్ ప్లే లో ఈ ఇద్దరూ ఒకరికి మించి ఒకరు ముంబై బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓవర్ కు రెండు ఫోర్లకు తగ్గకుండా ఈ ఇద్దరూ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తప్ప ఏడో ఓవర్ వరకూ మిగిలిన ప్రతీ ఓవర్లో ఈ ఇద్దరూ బంతిని బౌండరీ లైన్ దాటించారు. క్రిస్ జోర్డాన్ వేసిన పదో ఓవర్లో వివ్రాంత్ రెండు ఫోర్లు కొట్టి.. ఐదో బాల్ కు సింగిల్ తీసి 36 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అతి పిన్నవయస్సులోనే ఎస్ఆర్‌హెచ్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో ప్రియమ్ గార్గ్ (19 ఏండ్ల 307 రోజులు), అభిషేక్ శర్మ (21 ఏండ్ల 217 రోజులు) తర్వాత వివ్రంత్ (23 ఏండ్ల 203 రోజులు) నిలిచాడు.
Also Read : Music Director Raj: బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు
సన్ రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించిన వివ్రాంత్ శర్మను ఆకాశ్ మధ్వల్ ఎట్టకేలకు 14వ ఓవర్లో అవుట్ చేశాడు. వివ్రాంత్ ఔటయ్యాక కూడా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన మయాంక్ కూడా మధ్వల్ వేసిన 17వ ఓవర్లో నాలుగో బాల్ కు కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (1) ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (18), హ్యారీ బ్రూక్ (0) లు ఫెయిల్ అయ్యారు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని చివర్లో వికెట్లు ఉన్నా హైదరాబాద్ బ్యాటర్లు భారీ స్కోర్ గా మలుచుకోలేకపోయారు. ముంబై యువ బౌలర్ ఆకాశ్ మధ్వల్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?