ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆడే చివరి లీగ్ మ్యాచ్ ఇదే. ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకోవాలంటే ముంబై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడంతో ఒత్తిడి అంతా ముంబై ఇండియన్స్ పైనే ఉంది.
Also Read : Rain In Hydarabad : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ ఇ్దదరూ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివర్లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. లేకపోతే.. 230 ప్లస్ టార్గెట్ పక్కా అనుకున్న ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి.. 200 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై.. 70 బంతులు మిగిలుండగా ఛేదిస్తేనే ఆర్సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ వస్తుంది.
Also Read : Uttarakhand: మారుపేరుతో పరిచయం.. హిందూ యువతిపై అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్
ఇక.. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో ఓవర్‌లోనే ముంబై ఓపెనర్ బ్యాటర్ ఇషాన్ కిషన్(14) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 10 ఓవర్లకే 114 పరుగులు చేశారు.. కామెరూన్ గ్రీన్ ( 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 57 పరుగులు ) అర్థ సెంచరీతో దుమ్మురేపాడు. మరో ఎండ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ( 30 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 46 పరుగులు ) కూడా తన దూకుడైన బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్లు తీసేందుకు సన్ రైజర్స్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.