IPL Playoffs 2023: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. దీంతో 16వ సీజన్ విజేత ఎవరో ఈ వారాంతంలో తేలిపోనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠభరిత పోరాటాల ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ముందుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో స్థానంలో నిలిచింది. ఇక లక్నో సూపర్ జయింట్స్ (LSG) మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్ (MI)లలో ఎవరు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారన్నది చివరి రోజు వరకూ ఉత్కంఠ కొనసాగింది. అయితే, చివరి రోజు గుజరాత్ టైటాన్స్ చేతిలో (RCB) ఓడిపోయింది. మరోవైపు… సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ గెలిచింది. తద్వారా (RCB)ని ప్లే ఆఫ్‌కు రాకుండా చేసింది.
Read Also: Bandaru Port : నెరవేరనున్న దశాబ్దాల కల.. బందర్‌పోర్టుకు నేడే శంకుస్థాపన
ఇక, రేపు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో సూపర్ జయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే నిర్వహిస్తారు. ఈ నెల 26న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇక 28న ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌ను కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ ఒకటి, క్వాలిఫైయర్ 2 రెండులో గెలుపొందిన జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.