ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. వరుసగా రెండు విజయాలను సాధించిన ముంబై.. మరో విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. అటు సీఎస్కే కూడా.. ముంబైతో మ్యాచ్ లో గెలుపును నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఆదివారం) జరుగబోయే కీలక మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 నేడు (ఆదివారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ను వదిలి బస్సును నడిపాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో బౌండరీలు బాదడమే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చలాకీతనం ప్రదర్శిస్తారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను తరలించే బస్సుకు రోహిత్ డ్రైవర్ గా మారారు.
Jasprit Bumrah Wanted To Move Canada: భారత క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లలో ‘జస్ప్రీత్ బుమ్రా’ ఒకడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా.. 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్‌లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మేటి పేసర్ అయిన బుమ్రా.. ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. కెనడా క్రికెట్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు మిస్టర్ 360. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడేలో స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. అటు.. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ…
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఏప్రిల్ 10, బుధవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. మేనేజ్మెంట్ యొక్క ఈ చర్య ముంబై ఇండియన్స్ అభిమానుల నుండి భారీ విమర్శలకు దారితీసింది. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిల్స్…
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని సాధించింది. 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి గెలుపు రుచి చూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేనప్పటికీ.. అతనిలో నాయకత్వ స్ఫూర్తి ఇప్పటికీ కనిపిస్తుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్పీచ్ ఇచ్చాడు.