ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది. ముంబై బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో పంజాబ్ బ్యాటర్లు ఒక్కోక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ విజృంభించడంతో పంజాబ్ 6 ఓవర్లకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది.
Read Also: Konda Surekha: ప్రజల కష్టాలు తీరాలంటే రాహుల్ ప్రధాని కావాలి
ఇక, తొలి ఓవర్‌లోనే డేంజరస్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (0) వికెట్ తీసిన కోయిట్జీ.. ఆ తర్వాత ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్ లివింగ్‌ష్టోన్(1)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ కు పంపించాడు. దాంతో, పంజాబ్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, 6వ ఓవర్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ హార్‌ఫ్రీత్ సింగ్ భాటియా (5)ను శ్రేయస్ గోపాల్ ఔట్ చేయడంతో ప్రస్తుతం శశాంక్ సింగ్ ( 18 బంతుల్లో 35 పరుగులు 2 ఫోర్లు, 3 సిక్సులు ), జితేష్ శర్మ ( 8) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.