Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నా: జస్ప్రీత్ బుమ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Wanted To Move Canada: భారత క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లలో ‘జస్ప్రీత్ బుమ్రా’ ఒకడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా.. 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్‌లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మేటి పేసర్ అయిన బుమ్రా.. ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. కెనడా క్రికెట్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాడట. తన సతీమణి, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బుమ్రా స్వయంగా ఈ విషయంను వెల్లడించాడు.
‘నువ్వు ఒకప్పుడు కెనడాకు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్నావు కదా’ అని జస్ప్రీత్ బుమ్రాను సంజన గణేశన్ అడిగారు. అందుకు బుమ్రా బదులిస్తూ… ‘నిజమే, అప్పట్లో ఆ ఆలోచన వచ్చింది. భారతదేశంలో ప్రతి కుర్రాడూ క్రికెట్ ఆడాలనుకుంటాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే కుర్రాళ్లు ప్రతి వీధిలోనూ ఓ పాతిక మంది ఉంటారు. అందుకే ప్రత్యామ్నాయ ప్రణాళిక వేసుకున్నా’ అని తెలిపాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!
‘మా మేనమామ కెనడాలో ఉన్నారు. నేను చదువు పూర్తయ్యాక అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా. అయితే అక్కడ భిన్నమైన సంస్కృతి ఉంటుందన్న కారణంతో మా అమ్మ నన్ను వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత నాకు అంతా కలిసి వచ్చింది. ఐపీఎల్, భారత జట్టులో చోటు దక్కింది. లేదంటే నేను కెనడాకు వెళ్లి.. ఆ దేశ క్రికెట్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. ఇక్కడే ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 125 మ్యాచులు ఆడాడు.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!