ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. వరుసగా రెండు విజయాలను సాధించిన ముంబై.. మరో విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. అటు సీఎస్కే కూడా.. ముంబైతో మ్యాచ్ లో గెలుపును నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్, ఇషాన్ కిషాన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, మధ్వల్, కోయెట్జీ.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివం దూబే, అజింక్యా రహానె, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహమన్.