16 ఏళ్ల అమ్మాయిని 'ఐటమ్' అని పిలిచిన నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు వివాదాలు వదలడం లేదు. అప్పుడెప్పుడో ఆమె చేసిన వివాదాస్పద వైకాయలు ఇప్పటికీ ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. గతంలో కంగనా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్, కంగనాపై పరువు నష్టం కేసును వేశారు. గత కొన్నినెలల నుంచి ఈ కేసు ముంబై కోర్టులో నడుస్తుండగా.. ఇటీవల కంగనా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి…
విరసం నేత వరవర రావుకు బాంబే హైకోర్టు బెయిల్‌ను పొడిగించింది. 2018 భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆ ఏడాది ఆగస్టు 28 నుంచి ఆయన జైలులో ఉన్నారు. అయితే, ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో గతేడాది ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దీంతో మెడికల్ గ్రౌండ్స్ లో 2021 మార్చి 6న ఆరు నెలల పాటు వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆగస్టులో సరెండర్ అవ్వాల్సి…
మహిళకు మధ్య వేలు చూపించిన 33 ఏళ్ల వ్యక్తికి ముంబైలోని ఓ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2018, సెప్టెంబర్ 17న ముంబైలో ఓ మహిళ, తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా వారు క్యాడ్‌బరీ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి ఓ రెడ్ కలర్ కారు తమ ముందుకు దూసుకువచ్చింది. దీంతో మహిళ ప్రయాణిస్తున్న కారు 100 మీటర్ల వరకు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. అలా…
మనీలాండరింగ్ కేసులోఈ నెల 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు షాకిచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన కోరికను కోర్టు తోసి పుచ్చింది. “ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ కోరికను పరిగణలోకి తీసుకుంటాం” అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ఆమె సోదరి రంగోలి చందేల్‌కు భారీ ఊరట కలిగింది. ముంబైలోని అంధేరిలోని 66వ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో న్యాయవాది కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 15న రంగోలీ తన ట్విట్టర్ ఖాతాలో తబ్లిఘి జమాత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టడంతో కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ ఆమెపై కేసు వేశారు. సోదరికి సపోర్ట్ చేసినందుకు కంగనాకు…
పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన…