మనీలాండరింగ్ కేసులోఈ నెల 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు షాకిచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన కోరికను కోర్టు తోసి పుచ్చింది. “ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ కోరికను పరిగణలోకి తీసుకుంటాం” అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒక బెడ్ ఏర్పాటు చేయాలన్న అనిల్ దేశ్‌ముఖ్ కోరికను మాత్రం కోర్టు మన్నించింది. ఆయనకు కేటాయించిన గదిలో బెడ్ ఏర్పాటుకు అనుమతించింది.
అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2న అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకు న్నారు. ఈ కేసులో అనిల్ దేశ్ముఖ్తో పాటు కుందన్ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్ ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరో పించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు తీసుకుంది.