బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్, తాను ఎలాంటి నేరం చేయలేదని పేర్కొంటూ ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని, తనను ఇరికించడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నాడు. తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ఇస్లాం తరఫు న్యాయవాది పిటిషన్‌లో పొందుపర్చారు. అతను ఎప్పుడూ ఏంటి నేరం చేయలేదని పిటిషన్‌లో వివరించారు.
Mumbai Court: గుర్తు తెలియని మహిళకు రాత్రిపూట ‘‘ నువ్వు స్లిమ్‌గా ఉన్నావు, చాలా స్మార్ట్‌గా అందంగా ఉన్నాము, నువ్వుంటే నాకు ఇష్టం’’ అంటూ మెసేజ్ చేయడం అసభ్యకరమని ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. మాజీ కార్పొరేటర్‌కి వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు పంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి) డిజి ధోబ్లే ఈ వ్యాఖ్యలు చేశారు.
RSS Remarks Case: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఉపశమనం దొరికింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించుకోబడింది.
Mumbai Court: మహిళ అణుకువకు భంగం కలిగించడం, వారితో వెక్కిలిగా ప్రవర్తించడం కూడా తీవ్ర శిక్షార్హమైన నేరమే. ముంబైకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూసి కన్నుకొట్టిన నేరంలో దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, యావజ్జీవ శిక్ష తప్పదని భావించినప్పటికీ, అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, అతడి వయసు కారణంగా ప్రొబేషన్ బెనిఫిట్ ఇవ్వాలని ముంబై కోర్టుమేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి అభిప్రాయపడ్డారు.
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్‌నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్‌షిప్‌లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.
ఉద్యోగాలు చేసే చోట మహిళల ఎదుర్కొనే ఇబ్బందులు ముఖ్యంగా లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా పలు చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చారు. అయినా సరే ఏదో ఒక సాకుతో కొందరు మహిళలను వేధింపులకు గురిచేస్తుంటారు. చూపులతోనూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే తన సహోద్యోగుల కారణంగా ఇబ్బంది పడిన ఓ మహిళ.. విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన పై కోర్టు విచారణ జరిపిన అనంతరం కీలక తీర్పు ను ఇచ్చింది.. మీ సంస్థలో…
నటి జియాఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు.
JM Joshi : గుట్కా వ్యాపారి జేఎం జోషికి ముంబైలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల శిక్ష.. ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు జోషి సహకరించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.