Kangana Ranaut : స్టార్ హీరోయిన్ అయినా ఆమె ఆ కేసులో నిందితురాలు.. గుర్తుపెట్టుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు వివాదాలు వదలడం లేదు. అప్పుడెప్పుడో ఆమె చేసిన వివాదాస్పద వైకాయలు ఇప్పటికీ ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. గతంలో కంగనా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్, కంగనాపై పరువు నష్టం కేసును వేశారు. గత కొన్నినెలల నుంచి ఈ కేసు ముంబై కోర్టులో నడుస్తుండగా.. ఇటీవల కంగనా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. తాజాగా కోర్టు కంగనాకు షాక్ ఇచ్చింది. కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ఆర్‌ఆర్‌ఖాన్, కంగనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె పెట్టిన పిటిషన్ ని కొట్టివేస్తూ ఆమె సెలబ్రిటీ కావొచ్చు కానీ ఒక కేసులో నిందితురాలు.. అది మర్చిపోకూడదని తెలిపారు.
ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకాకుండా ఎగ్గొట్టడమే కాకుండా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని, అసలు కేసు ఎక్కడివరకు వెళ్లిందో, విచారణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మినహాయింపు కోరడం మీదనే ప్రత్యేక శ్రద్ద పెట్టడమేంటని మండిపడ్డారు. ఇక ఇప్పటివరకు విచారణకే రాని ఆమెకు ఇప్పుడు మినహాయింపు ఇస్తే అస్సలు ఇకనుంచి విచారణకు కూడా రాదని, అందుకే ఆ పిటిషన్ ను కొట్టివేస్తునట్లు తెలిపారు. దీంతో కంగనాకు గట్టి దెబ్బనే తగిలిందని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా ఉన్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జావేద్ ఆమెపై కోర్టులో కేసు వేశారు. మరి కోర్టు ఇచ్చిన షాక్ కి ఈ ఫైర్ బ్రాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!